మెగా ఫ్యాన్స్​కు బ్యాడ్​న్యూస్.. ‘గ్యాంగ్​లీడర్’ రీరిలీజ్ వాయిదా

-

మెగాస్టార్​ అభిమానులకు బ్యాడ్​న్యూస్. మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ఒకప్పటి బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ ‘గ్యాంగ్‌లీడర్‌’ సినిమా రీరిలీజ్‌ వాయిదా పడింది. నేటి సాంకేతికకు అనుగుణంగా 4కే వెర్షన్‌లోకి ‘గ్యాంగ్‌లీడర్‌’ను సిద్ధం చేయగా.. ఫైనల్‌ అవుట్‌పుట్‌ విషయంలో చిత్రబృందం అసంతృప్తిగా ఉందని.. అందుకే ఈ సినిమా రీరిలీజ్‌ వాయిదా పడిందని సినీ ప్రియులు అనుకుంటున్నారు. ఈ వార్తలపై మెగా అభిమానులు ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా దీన్ని రీరిలీజ్‌ చేయాలని కోరుతున్నారు.

చిరంజీవి నటించిన బ్లాక్‌బస్టర్‌ చిత్రాల్లో ‘గ్యాంగ్‌లీడర్‌’ కూడా ఒకటి. సుప్రీమ్ హీరోగా ఉన్న చిరంజీవిని మెగాస్టార్‌గా మార్చిన సినిమాల్లో ఇది కూడా ఉంది. మాస్‌, కమర్షియల్‌ హంగులతో విజయ బాపినీడు దీన్ని తెరకెక్కించారు. ‘గ్యాంగ్‌ లీడర్‌’ విడుదలై ఈ ఏడాదితో సుమారు 32 ఏళ్లు అవుతోన్న నేపథ్యంలో చిత్రబృందం దీన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని యోచించింది. ఇందులో భాగంగానే ఫిబ్రవరి 11న ఈసినిమా రీరిలీజ్‌ ముహూర్తం సిద్ధం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version