చిరు రాజకీయం.. కాంగ్రెస్‌కు అడ్వాంటేజ్..?

-

ఏదేమైనా చిరంజీవిని..రాజకీయాలని వేరు వేరుగా చూడలేని పరిస్తితి. ఎప్పుడైతే చిరంజీవి ప్రజారాజ్యం పెట్టి రాజకీయం మొదలుపెట్టి, ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి..చివరికి చిరు రాజకీయాల నుంచి తప్పుకున్నా సరే..ఆయన చుట్టూ మాత్రం రాజకీయం నడుస్తూనే ఉంది. ఎప్పుడు ఏదొకవిధంగా ఆయన సెంట్రిక్‌గా రాజకీయం జరుగుతుంది. అందుకే అనుకుంటా తాజాగా చిరు..తన ట్విట్టర్ ఖాతాలో..తాను రాజకీయాలకు దూరమైన సరే..తన నుంచి మాత్రం రాజకీయాలు దూరం కాలేదు అని డైలాగ్ పెట్టారు.

 

వాస్తవానికి ఇది త్వరలో రాబోతున్న గాడ్‌ఫాదర్ సినిమాలోనే డైలాగ్. కానీ వాస్తవ పరిస్తితులకు అనుగుణంగానే చిరంజీవి ఈ డైలాగుని బయటకు వదిలారని తెలుస్తోంది. ఎందుకంటే ఈయన చుట్టూ రాజకీయం నడుస్తూనే ఉంది. కాకపోతే చిరు..కాస్త జగన్‌కు మద్ధతుగా ఉన్నారనే వాదన ఉంది. ఇప్పటికే జగన్‌తో పలుమార్లు భేటీ అయ్యారు…సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలు చెప్పుకున్నారు. అలాగే చిరంజీవి పేరుని రాజకీయంగా వాడుకుంటూ..వైసీపీ నేతలు పవన్ పై విమర్శలు చేస్తున్నారు.

ఇలా ఏదొకరకంగా చిరు పేరు రాజకీయాల్లో వినిపిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే చిరు..ఆ డైలాగ్ పేల్చారు. ఇంకా విచిత్రం ఏంటంటే..ఈ డైలాగ్ వచ్చిన తర్వాత రోజే..అనూహ్యంగా చిరుకు కాంగ్రెస్ గుర్తింపు కార్డు వచ్చింది. పీసీసీ డెలిగేట్‌గా గుర్తిస్తూ ఐడీ కార్డు జారీ చేసింది. పార్టీ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించింది ఈ డెలిగేట్ కార్డు. ఇలా కార్డు ఇచ్చి కాంగ్రెస్ సైతం చిరు మావాడు అనే విధంగా రాజకీయం మొదలుపెట్టింది.

ఇక చిరంజీవి మావాడు అని చెప్పి..రెండు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసుకోవాలనేది కాంగ్రెస్ ప్లాన్ గా కనిపిస్తోంది. అయితే చిరంజీవి ఇప్పుడున్న పరిస్తితుల్లో మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతారా? అది కూడా కాంగ్రెస్ లో పనిచేస్తారా? అంటే చెప్పడం కష్టమే. ఎందుకంటే మళ్ళీ చిరు రాజకీయాల జోలికి వెళ్లకపోవచ్చు. పైగా తన సోదరుడు పవన్..జనసేన కూడా ఉంది. కాబట్టి సోదరుడు పార్టీని వదులుకుని వేరే పార్టీ వైపు చూడటం కష్టమే. ఏదేమైనా గాని చిరు రాజకీయం అర్ధం కాకుండా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version