Chiranjeevi-Tadap trailer: `తడప్` ట్రైలర్ పై చిరు కామెంట్!

-

Chiranjeevi-Tadap trailer: అజయ్ భూపతి డైరెక్ష‌న్ తో కార్తికేయ హీరోగా తెర‌కెక్కిన చిత్రం ఆర్ఎక్స్ 100. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఎలాంటి విజ‌యం సాధించిందో అంద‌రికీ తెలుసు. అయితే ఈ సినిమాని ప్రస్తుతం బాలీవుడ్ లో తడప్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా సునీల్ శెట్టి కుమారుడు ఆహాన్ శెట్టి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఆయ‌నకు జంట‌గా తారా సుతారియా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రిమేక్ చిత్రానికి మిలన్ లుథ్రియా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు మంచి బజ్ ని తీసుకొచ్చాయి. దీంతో ఈ రీమేక్ మూవీపై భారీగా అంచనాలు నెల‌కొన్నాయి.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ రిలీజ్ చేసారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. కథలో చాలా మార్పులు చేశారని అర్థమవుతోంది. యాక్షన్.. రొమాన్స్ లవ్ వంటి అంశాలను హైలెట్ చేసిన‌ట్టు క‌నిపిస్తుంది. హీరో-హీరోయిన్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు చాలా హాట్ గా ఉన్నాయి. విజువల్స్ ఎనర్జీతో ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రానికి ప్రీతమ్ సంగీతం మరో ఫ్ల‌స్ పాయింట్. ఇక ఈ సినిమా డిసెంబర్ 3 న రిలీజ్ కాబోతోంది. సోష‌ల్ మీడియాలో ఈ ట్రైలర్ దూసుక‌పోతుంది.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ పై మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు. `రా అండ్ ఇంటెన్స్` ట్రైలర్ .. టైల‌ర్ అదిరిపోయింది. ఇంప్రెస్సివ్ గా ఉంది. ఆహాన్ శెట్టికి మంచి విజయం దక్కాలి“ అని చిరంజీవి ఆకాంక్షించారు. `తడప్` చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version