Chiranjeevi: ఫుల్‌ స్వింగ్‌లో ‘విశ్వంభర’.. ఇదే సీన్ సినిమాకి ప్రాణాధారం..

-

వశిష్ఠ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న సోషియో ఫాంటసీ ఫిల్మ్‌ ‘విశ్వంభర’ . ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా త్రిష నటిస్తుంది. సురభి, ఇషాచావ్లా తదితరులు కీలక పాత్రల్లో పోషిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా షెడ్యూల్‌లో కొంత టాకీ పార్ట్‌, ఓ పాటను పూర్తి చేయగా, ఇప్పుడు అదిరిపోయే యాక్షన్‌ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తోంది.హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఏర్పాటుచేసినప్రత్యేక సెట్‌లో చిరంజీవి, కొంతమంది ఫైటర్ల మధ్య దీన్ని చిత్రీకరిస్తున్నారు.

భారీ స్థాయిలో చిత్రీకరిస్తున్న ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌ సినిమాకే హైలైట్‌గా నిలవనుందని చిత్రబృందం చెబుతోంది. యాక్షన్‌ కొరియోగ్రాఫర్లు రామ్‌ లక్ష్మణ్‌ పర్యవేక్షణలో ఈ షూట్‌ జరుగుతోంది. ఈ మూవీ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే ఏడాది జనవరి 10న సంక్రాంతి కానుకగావిడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version