బాల‌య్య‌కి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి..!

-

చిరు నేతృత్వంలోని సీని ప్రముఖులు కొందరు మంత్రి తలసానితో భేటీ అవ్వడం.. దానిపై బాలయ్య స్పందిస్తూ భూములు పంచుకోవడం కోసమే వారి కలయిక అని అనడంతో సినీ వర్గంలో పెద్ద యుద్ధమే మొదలైంది. అయితే బాలయ్య వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు, దీంతో వివాదం మరింత ముదిరింది. ఆ వివాదం కాస్త మెగా వర్సెస్ నందమూరిగా మారింది. కాలక్రమేణా ఈ వివాదం చల్లబడింది. అయితే చిరు బాలయ్యల మధ్య అంతర్గతంగా కొన్ని మనస్పర్ధలు తలెత్తాయని ఒక టాక్ ఉంది.

 

ఈ నేపధ్యంలో విటన్నీటికి చెక్ పెట్టె విదంగా బాల‌కృష్ణ 60వ బ‌ర్త్ డే సంద‌ర్భంగా చిరంజీవి త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా శుభాకాంక్ష‌లు తెలిపారు. ’60లో అడుగుపెడుతున్న మా బాలకృష్ణకి షష్టి పూర్తి శుభాకాంక్షలు. ఇదే ఉత్సాహంతో ,ఉత్తేజంతో ఆయురారోగ్యాలతో నిండునూరేళ్ల సంబరం కూడా జరుపుకోవాలని, అందరి అభిమానం ఇలాగే పొందాలని కోరుకుంటున్నాను. 60 ఏళ్ళ గ‌త స్మృతుల‌ని నేను గుర్తు చేసుకుంటున్నాను. హ్యాపీ బ‌ర్త్‌డే బాల‌కృష్ణ’ అంటూ చిరు ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version