వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ ఇప్పట్లో క్రికెట్ నుంచి తప్పుకునే అవకాశాలు కనపడటం లేదు. అతను మరింత కాలం క్రికెట్ ఆడటానికి మానసికంగా సిద్దంగా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో ఆడుతున్న ఈ కరేబియన్ క్రికెటర్ క్రికెట్ ని మరిన్ని రోజులు ఎంజాయ్ చేస్తా అంటున్నారు. విధ్వంశక ఆటగాడిగా గుర్తింపు పొందిన 40 ఏళ్ళ గేల్ కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే.
తాజాగా అతకి సంబంధించి ESPN క్రిక్ ఇన్ఫో ఒక కథనం ప్రచురించింది. “చాలా మంది ఇప్పటికీ క్రిస్ గేల్‌ను ఆటలో చూడాలని కోరుకుంటారు. నాకు ఇప్పటికీ ఆటపై ఆ ప్రేమ మరియు ఆట పట్ల ఆ అభిరుచి ఉంది. వీలైనంత కాలం కొనసాగడానికి నేను ఇష్టపడతాను” అని గేల్ చెప్పినట్టు పేర్కొంది. ఒకసారి గేల్ ఏమన్నాడు అనేది చూస్తే, “ఫ్రాంచైజ్ క్రికెట్‌లో కూడా, నేను ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కొన్ని మ్యాచ్ లు ఆడుతున్నాను, ఎందుకంటే నాకు ఇంకా చాలా ఆఫర్లు ఉన్నాయని నేను భావిస్తున్నా.
శరీరం క్రికెట్ ని ఎంజాయ్ చేస్తుంది. రోజులు గడుస్తున్న కొద్దీ నేను చిన్నవయసులో ఉన్నానని నాకు ఖచ్చితంగా తెలుసు,” అంటూ గేల్ పేర్కొన్నాడు. మరో ఐదేళ్ల పాటు క్రికెట్ ఆడవచ్చని చెప్పాడు. “నలభై ఐదు మంచి సంఖ్య. అవును, నేను 45 ని లక్ష్యంగా చేసుకోవచ్చు. 45 ని లక్ష్యంగా చేసుకుందాం, అది మంచి సంఖ్య౦టూ చెప్పుకొచ్చాడు. ఇదే సమయంలో యువకులకు కూడా అవకాశం రావాలని గేల్ పేర్కొన్నాడు. టి 20 ప్రపంచ కప్‌లో ఆడే అవకాశం కోసం విధ్వంసక బ్యాట్స్‌మన్ తలుపులు తెరిచి ఉంచాడు.