చంద్రబాబు ను అరెస్ట్ చేసిన సిఐడి పోలీసులు ఆయన్ను కాసేపటి క్రితమే ఆఫీస్ కు తీసుకువచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకు టీడీపీ నేతలు మరియు మద్దతుదారులు సానుభూతిని తెలియచేస్తున్నారు. కాగా కొంచెం సేపు సిఐడి అధికారులు ఆయనకు విశ్రాంతిని కల్పించి , ఆ తర్వాత చంద్రబాబు పై ప్రశ్నల వర్షం కురిపించనున్నారు. ఇప్పటికే సిఐడి అధికారులు ప్రశ్నల లిస్ట్ ను రెఢీ చేసుకున్నారట… అందులో ముఖ్యంగా కేబినెట్ యొక్క ఆమోదం లేకుండా ఎందుకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు ? గంటా సుబ్బారావుకు పదవులు ఇవ్వడం , వాటి ప్రాతిపదికలు మరియు సిమెన్స్ కంపెనీ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా ప్రభుత్వం ఏ విధంగా 371 కోట్లు రిలీజ్ చేసింది అంటూ వివిధ ముఖ్యమైన ప్రశ్నల లిస్ట్ ను తయారు చేసుకుంది. మరి ఇందులో చంద్రబాబు ఇంకెవరి పేర్లు అయినా బయట పెడతారా చూడాలి.
సిఐడి విచారణలో బయటకు వచ్చే ఒక్కో విషయం సంచలనం అవుతుంది… మరి ఈ కేసులో చంద్రబాబు లు ఎన్ని సంవత్సరాల శిక్ష పడుతుంది అన్నది ఈ విచారణ పైనే ఆధారపడనుంది