దేశం లో జనాభా తగ్గుతోంది. ముఖ్యంగా సౌత్ ఇండియా.. జనాభాలో డేంజర్ జోన్ లో ఉంది అని ఏపీ సీఎం చంద్రబబు అన్నారు. కాబట్టి సౌత్ ఇండియా సంపద కాదు జనాభాను కూడా సృష్టించాలి. సంపదతో పాటు జనాభా సృష్టి కూడా జరగాలి అని సూచించారు. అలాగే రాష్ట్రంలో అన్నిటికంటే అభివృద్ధి అనేది కీలకం. ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి. వ్యక్తిగత ఆదాయం పెరగాలి. ఆరోగ్యం బావుండాలి.. ఆనందంగా ఉండాలి.
ఐతే రాష్ట్రంలో టూరిజం 20 శాతం గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. 2047 నాటికి రాష్ట్ర తలసరి ఆదాయం 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ గా ఏపి నీ తీర్చి దిద్దెలా ప్రణాళికలు రచిస్తున్నం. గడచిన కొన్నేళ్ళు గా 10 శాతం మాత్రమే వృద్ధి రేటు ఉంది. ప్రభుత్వ ప్రణాళికల్లో భాగంగా 15 శాతం గా వృద్ధి రేటు చేరితే జీ ఎస్ డిపి 347 లక్షల కోట్ల కు చేరుతుంది. తలసరి ఆదాయం 58 లక్షల కోట్ల మేర పెరిగే అవకాశం ఉంది. అన్ని అంశాల కంటే కీలకం అభివృద్ధి. ప్రజలకు ఇవన్నీ అర్థం కాకపోయినా వారి జీవన ప్రమాణాలతో ముడిపడి ఉన్న అంశం ఇది అని చంద్రబాబు పేర్కొన్నారు.