సీఎం ఢిల్లీ టూర్.. దంత వైద్యం చేసుకున్న కేసీఆర్

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ ఇటీవ‌ల ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన విషయం తెలిసిందే. కాగ ఢిల్లీ టూర్ లో ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ తో పాటు ప‌లు కీల‌క నేత‌ల‌తో స‌మావేశం అవుతార‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఢిల్లీలో సీఎం కేసీఆర్.. దంత వైద్యం చేసుకున్నారు. సీఎం కేసీఆర్ వ్య‌క్తిగ‌త వైద్యురాలు పూనియా ఆయ‌న కు వైద్యం చేసింది. కాగ బుధ వారం మ‌రోసారి త‌న దంత స‌మ‌స్యపై డాక్ట‌ర్ క‌లిసే అవకాశం ఉంద‌ని తెలుస్తుంది. కాగ ఈ రోజు సీఎం కేసీఆర్ స‌తీమ‌ణి శోభ ఎయిమ్స్ సాధార‌ణ వైద్య ప‌రీక్షలు చేసుకునే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.

వైద్య ప‌రీక్షల అనంత‌రం.. సీఎం కేసీఆర్ దంత స‌మ‌స్య చికిత్స ముగిసిన త‌ర్వాత తిరిగి హైద‌రాబాద్ కు వ‌స్తార‌ని తెలుస్తోంది. కాగ ఇప్ప‌టి వ‌ర‌కు సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్.. రాజ‌కీయ పరంగానే వార్తలు వ‌చ్చాయి. కానీ ఇది రాజ‌కీయ టూర్ కాద‌ని.. సీఎం కేసీఆర్ వ్య‌క్తిగ‌త టూర్ అని స‌మాచారం. అలాగే సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లిన త‌ర్వాత కూడా.. ఇప్ప‌టి వ‌ర‌కు రాజకీయంగా ఒక్క వ్యాఖ్య కూడా చేయ‌లేదు.

మంగ‌ళ వారం.. త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఒక ట్వీట్ చేశారు. అంతే త‌ప్ప‌.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. దీంతో కేసీఆర్ ఢిల్లీ టూర్ వ్య‌క్తిగ‌త‌మే అని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version