శ్రీకాకుళం : డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. జగన్ ఆగర్భ శ్రీమంతుడని.. జగన్ లాంటి నాయకుడు నభూతో నః భవిష్యత్ అని తెలిపారు. అలాంటి నాయకుడు మరొకరు దొరకరు … భవిష్యత్ లో రాబోరని స్పష్టం చేశారు. మొదటి నుంచి తాను ఆయనతో కలిసి నడిచానని… టీడీపీ విమర్శలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. చంద్రబాబుకు 69 ఏళ్లు వచ్చేశాయని… వయసు అయిపోవడం వల్ల చంద్రబాబు చిన్నపిల్లోడిలా వ్యవహరిస్తున్నారని చురకలు అంటించారు.
జగన్ ను విమర్శించడం చంద్రబాబు, టీడీపీ నేతలు మానుకోవాలన్నారు. రెండెకరాలున్న చంద్రబాబు ఈ స్థాయికి ఎలా ఎదిగాడో… మర్చిపోతే ఎలా ? అని చురకలు అంటించారు. చంద్రబాబు , లోకేష్ లను చూస్తే జాలేస్తుందని.. నక్కకు నాగ లోకానికీ ఉన్న తేడా లోకేష్ తెలుసుకోవాలన్నారు. రెండు చోట్ల పోటీచేసి ఓడిపోయిన.. లోకేష్ కు జగన్ ను విమర్శించే స్థాయి ఉందా ? అని నిలదీశారు. తలకిందులుగా తపస్సు చేసినా జగన్ ను అందుకోవడం లోకేష్ వల్ల కాదని తెలిపారు.