జీరో రూపీ నోట్‌ను ఎలా వాడాలో తెలుసా?

-

అసలు జీరో రూపాయి నోట్‌ అనేది ఒకటుందన్న విషయం చాలా మందికి తెలీదు. కానీ, ఇది ఇండియాలో విస్తరిస్తోంది. ఆ వివరాలు తెలుసుకుందాం. ప్రభుత్వ అధికారులు లంచం అడగడం,… ప్రజలు ఇవ్వడం భారత్‌లో కామన్‌.  చట్టప్రకారమైతే ఇది నేరం. అయితే, అమెరికాలో జాబ్‌ చేసిన సాఫ్ట్‌వేర్‌ ఎన్నారై ఆనంద్, ఇండియా వచ్చినప్పుడు ఇక్కడ జరుగుతున్న అవినీతిని చూసి ఆశ్చర్యపోయారు. దీనికి ఎలా బ్రేక్‌ వెయ్యాలి అని ఆలోచించిన ఆయన… ఫిఫ్త్‌ పిల్లర్‌ అనే స్వచ్ఛంద సంస్థను 2007లో స్థాపించారు.

zero note

ఈ సంస్థ జీరో రూపీ నోట్లను తయారుచేస్తోంది. ఈ నోట్లు మామూలు కరెన్సీలాగా చెల్లవు. వీటిపై అమౌంట్‌కు బదులు జీరో ఉంటుంది. ఈ నోట్లపై నేను లంచం ఇవ్వను, తీసుకోను అనే ప్రమాణం రాసి ఉంటుంది.

ఎవరైనా ప్రభుత్వ అధికారి లంచం అడిగితే… ఈ నోట్లను ఇవ్వండి అని కోరుతున్నారు ఆనంద్‌. వీటిని ఇచ్చే ముందు… అవినీతి నిరోధక వ్యవస్థ అధికారులకు సమాచారం ఇస్తే… వారి లంచావతారం సంగతి అధికారులు చూసుకుంటారని ఆనంద్‌ చెబుతున్నారు.

2007 నుంచి 2014వరకూ ఫిఫ్త్‌ పిల్లర్‌ సంస్థ 25 లక్షల నోట్లను ప్రింట్‌ చేసి ప్రజలకు ఇచ్చింది. ఈ నోట్లను మొదటిసారి చెన్నైలో ఉపయోగించారు. ఆ తర్వాత తమిళంతోపాటూ… తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ నోట్లను ప్రింట్‌ చేస్తున్నారు.

లంచం ఇవ్వడం నేరం. కాబట్టి… ఏసీబీ అధికారులు పట్టుకుంటే… ఆ అవినీతి అధికారి… ‘అతను లంచం ఇచ్చాడు కాబట్టే… నేను తీసుకున్నాను. లంచం ఇచ్చినందుకు అతన్ని కూడా అరెస్టు చెయ్యాలి‘ అని మెలిక పెట్టే ప్రమాదం ఉంది. అందువల్ల ఈ జీరో నోట్లను ఇస్తే… లంచం ఇచ్చినట్లు అవ్వదు. మీకూ ఈ నోట్లు కావాలా? అయితే, వెంటనే https://5thpillar.org కోరాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version