ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాల విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకానికి ‘జగనన్న గోరుముద్ద’గా నామకరణం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శాసన సభలో కీలక ప్రకటన చేసారు. అమ్మ ఒడి గురించి ప్రస్తావిస్తున్న సమయంలో జగన్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. భోజనంలో కూడా మార్పుల గురించి ఆయన వివరించారు.
ఒకే తరహా భోజనాన్ని అందించి విద్యార్థులకు మొహం మొత్తేలా చేయకుండా ప్రతి రోజూ ఓ కొత్త రకమైన వంటకం ఉండేలా మెనూలో మార్పులు చేశామని వ్యాఖ్యానించారు. గతంలో దీనిపై ప్రకటన చేసిన ప్రభుత్వం నేడు అధికారికంగా అసెంబ్లీలో ప్రకటించారు ముఖ్యమంత్రి. దీనిపై ఇప్పుడు విద్యార్ధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సోమవారం : అన్నం, పప్పుచారు, కోడి గుడ్డు కూర, చిక్కీ (వేరుశనగ పప్పు బెల్లం కలిపి వండే వంటకం)
మంగళవారం : పులిహోర, టమాట పప్పు, ఉడకబెట్టిన గుడ్డు
బుధవారం : వెజిటబుల్ రైస్, ఆలూ కుర్మా, ఉడకబెట్టిన గుడ్డు, చిక్కీ
గురువారం : కిచిడీ, టమాటా చట్నీ, ఉడకబెట్టిన గుడ్డు
శుక్రవారం : అన్నం, ఆకుకూర పప్పు, ఉడకబెట్టిన గుడ్డు, చిక్కీ
శనివారం : అన్నం, సాంబార్, తీపి పొంగల్