ఏపీ గ్రామ పంచాయతీలకు సీఎం జగన్ శుభవార్త

-

వ్యవసాయ ఉత్పత్తుల రవాణా కోసం గ్రామాల్లోని 9227 కిలో మీటర్ల లింక్ రోడ్లు అభివృధ్ది చేయనున్నామని పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు అన్నారు. ఇందు కోసం ఏఎంసీ నిధులు 1070 కోట్ల రూపాయలతో పాటు బ్యాంక్ లింకేజి నిధులతో ఈ రోడ్ల అభివృద్ధి చేయనున్నామని.. గత ప్రభుత్వం గ్రామాల్లో లింక్ రోడ్ల అభివృద్ధి విస్మరించిందని వెల్లడించారు.

దీనితో ఈ రెండేళ్లలో కురిసిన వర్షాలకు చాలా వరకు రోడ్లు దెబ్బతిన్నాయని.. ఈ విషయం గమనించిన ముఖ్యమంత్రి గ్రామీణ రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యతను ఇచ్చారని తెలిపారు. వెంటనే పనులు చేపట్టాలని ఆదేశించారని.. వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు అనుకూలంగా 7.5 మీటర్ల వెడల్పుతో రోడ్లను అభివృద్ధి చేయనున్నామని పేర్కొన్నారు.

వర్షాలు పడేలోపు పనులు పూర్తి చేస్తామని.. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, డిజిటల్ లైబ్రరీలు నిర్మాణానికి నిధులు మంజూరు చేయనున్నామని వెల్లడించారు. వీటి నిర్మాణం పూర్తి చేయాలని కలెక్టర్లకు సిఎం ఆదేశాలు ఇచ్చారని.. రాష్ట్రంలో ఉన్న నాబార్డు, పి.ఎం.జి.ఎస్.వై. తదితర రోడ్లు టెండర్లు పూర్తయ్యి నత్త నడకన నడుస్తున్నాయన్నారు. వీటిని త్వరిత గతిన పూర్తి చేయాలని కాంట్రాక్టలతో సమావేశం అయ్యి తగిన ఆదేశాలు ఇచ్చామని.. ఉపాధిహామీ పనులకు బిల్లులు చెల్లింపులు చేస్తున్నామని వెల్లడించారు. ఇటీవల వెయ్యికోట్లు విడుదల చేశాం… జగనన్న కాలనీల కోసం భూమి చదును బిల్లులను కూడా త్వరలో చెల్లింపులు చేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version