సంక్షేమ సారథిగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే ముద్ర వేసుకున్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగులేకపోయినా..? కేంద్రం నుంచి సాయం రాకపోయినా.. సంక్షేమ పథకాలు ఆపడం లేదు.. చెప్పినవే కాకుండా.. కొత్త కొత్త పథకాలు ప్రకటిస్తున్నారు. ముందు చెప్పిన విధంగానే.. సమయానికి కాస్త అటు ఇటుగా.. ఆలస్యం లేకుండానే విడతల వారిగా పలు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుడుతున్నారు. తాజాగా వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకంలో మార్పులు తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు, భవన కార్మికుల కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది. ముఖ్యంగా పేద కుటుంబాల్లోని ఆడపిల్లల వివాహానికి ఈ పథకం ద్వారా ఆర్థికసాయం చేస్తున్నారు.
ప్రతి ఏటా 4 విడతల్లో YSR కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకానికి సంబంధించిన ఆర్థిక సాయాన్ని అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం
వెల్లడించింది. ఫిబ్రవరి, మే, ఆగస్టు, నవంబర్ నెలల్లో దరఖాస్తు చేసుకున్న వారి అకౌంట్లలో డబ్బులు జమ చేయనుండగా.. ఈ పథకం కింద కులాంతర వివాహం చేసుకుంటే కౌ1.20లక్షలు, దివ్యాంగులకు 31.5లక్షలు, మైనార్టీలకు కౌలక్ష, బీసీలకు 50 వేలు అందించనున్నారు. వధూవరులిద్దరూ తప్పనిసరిగా టెన్త్ పాసై ఉండాలి.