మహిళల భద్రతపై సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

-

అమరావతి: మహిళల భద్రతపై సీఎం వైయస్‌ జగన్‌ అత్యున్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ కె.వి. రాజేంద్రనాథ్‌రెడ్డి, సీఎంఓ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు. మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టిపెట్టాలని…దిశ యాప్‌పై పూర్తి చైతన్యం కలిగించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. దాన్ని ఎలా వాడాలన్న దానిపై అవగాహన కలిగించాలని.. ఇంటింటికీ వెళ్లి మహిళల ఫోన్లలో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసేలా చూడాలన్నారు.

గ్రామ సచివాలయాల్లోని మహిళా పోలీసులు, వాలంటర్లతో మహిళలకు అవగాహన కలిగించాలని.. ముందుగా మహిళా పోలీసులకు, వాలంటీర్లకు శిక్షణ ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో ఈ యాప్‌ను ఎలా ఉపయోగించాలన్నదానిపై అక్క చెల్లెమ్మలకు చెప్పాలని… దిశ యాప్ పై అవగాహన కల్పించటాన్ని ఒక డ్రైవ్‌గా తీసుకోవాలని సీఎం ఆదేశించారు. కాలేజీలు,విద్యా సంస్థల్లో విద్యార్థినులకు యాప్‌వినియోగంపై అవగాహన కలిగించాలన్న సీఎం… దిశ పోలీస్‌ స్టేషన్లు, స్థానిక పోలీస్‌స్టేషన్లు సత్వరమే స్పందించేలా వారిని సన్నద్ధంచేయాలని తెలిపారు. పోలీస్‌ స్టేషన్లలో అవసరమైనన్ని పెట్రోలింగ్‌ వాహనాలను సమకూర్చాలని ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version