సెప్టెంబర్ నుంచే విశాఖలోనే కాపురం పెడతానంటూ సంచలన ప్రకటన చేశారు ఏపీ సీఎం జగన్. ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు సీఎం జగన్. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… అన్ని ప్రాంతాల ప్రజలకు ఆమోధ్యయోగమైన రాజధాని విశాఖ అని.. సెప్టెంబర్ నుంచే విశాఖలోనే తాను ఉంటానని చెప్పారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అందరికీ ఆమోదయోగ్యమైన నగరం విశాఖ అన్నారు సీఎం జగన్. శ్రీకాకుళం జిల్లా ముఖచిత్రం మారబోతోంది.. పోర్టు సామర్థ్యం వంద బిలియన్లకు చేరుతుంది.. మూలపేట.. అభివృద్ధికి మూలస్తంభం అని తెలిపారు సీఎం వైఎస్ జగన్. ప్రత్యక్షంగా 35 వేలమందికి ఉపాధి.. పోర్టు ఆధారిత పరిశ్రమలు వస్తే లక్ష మందికి ఉపాధి లభిస్తుందన్నారు. పోర్టు నిర్మాణం పూర్తి అయితే జిల్లా వాసులు పోవాల్సిన అవసరం ఉండదని వివరించారు సీఎం వైఎస్ జగన్.