ఏపీ రైతులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పై సీఎం వైయస్.జగన్ నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ… 175 నియోజవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో రిగ్గు ఉండాలని.. ఒక్కో బోరుకు కనీసం రూ.4.50 లక్షల ఖర్చు చేస్తున్నామని ప్రకటన చేశారు.
ఐదు ఎకరాలలోపు అర్హత ఉన్న రైతులకు అన్ని రకాల సౌకర్యాలతో ఉచిత బోరు మంజూరు చేస్తామని.. 5–10 ఎకరాల మధ్యలో ఉన్న రైతులకు డ్రిల్లింగ్ ఉచితమని తెలిపారు సీఎం జగన్. చెరువులను కాలువల ద్వారా అనుసంధానం చేసే దిశగా పని చేయాలని.. రానున్న ఐదేళ్లలో ప్రతి చెరువును కెనాల్స్, ఫీడర్ ఛానెల్స్‌కి లింక్ చేయగలిగితే నీటి ఎద్దడిని నివారించగలుగుతామని స్పష్టం చేశారు.
కడప, అనంతపురం లాంటి ప్రాంతాల్లో కాలువలు ద్వారా ట్యాంకులను కనెక్ట్ చేయాలని..దీనికి సంబంధించిన సమగ్ర ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. ఉపాధి హామీ పనుల బిల్లుల అప్‌లోడ్‌తో పాటు చెల్లింపుల్లో నూ ఆలస్యం ఉండకూడదని…ఈ మేరకు అవసరమైన ప్రణాళిక ముందుగానే చేసుకోవాలని తెలిపారు. అవసరమైతే ఢిల్లీ స్ధాయిలో దీని కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని..గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల సహా మొత్తం నాలుగు రకాల భవనాల నిర్మాణాలు పూర్తి కావాలని స్పష్టం చేశారు.