48 గంటల్లో ఏ ఇల్లు మిగిలి పోకుండా రూ. 2వేలు అందించాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. గోదావరి వరదలపై సీఎం జగన్ రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ… వరద నీరు క్రమంగా తగ్గుముఖం పడుతోందని… సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేయాల్సి ఉందని పేర్కొన్నారు. సీనియర్ అధికారులు, కలెక్టర్లు భుజాలమీద ఈ బాధ్యత ఉందని.. వచ్చే 48 గంటల్లో ఏ ఇల్లు మిగిలి పోకుండా రూ.2వేల రూపాయల సహాయం అందాలని ఆదేశించారు.
25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళా దుంపలు, కేజీ ఉల్లిపాయలు, కేజీ పామాయిల్… ఈ రేషన్ అంతా ఉంది.. వదర బాధిత కుటుంబాలకు వచ్చే 48 గంటల్లో అందాలన్నారు. ముంపునకు గురైన ప్రతి గ్రామంలో పంపిణీని ముమ్మరం చేయాలి… కలెక్టర్లు, సీనియర్ అధికారులు దీన్ని సవాల్‌గా తీసుకోవాలని సూచనలు చేశారు. గతంలో రెండు జిల్లాలకు ఇద్దరు కలెక్టర్లు మాత్రమే ఉండేవారు… ఇద్దరు జాయింట్‌కలెక్టర్లు మాత్రమే, ఇద్దరు ఎస్పీలు మాత్రమే ఉండేవారని పేర్కొన్నారు. కాకినాడతో కలుపుకుని ఆరుగురు కలెక్టర్లు, ఆరుగురు జేసీలు, ఆరుగురు ఎస్పీలు ఉన్నారన్నారు. నాణ్యమైన సేవలు అందించాలని.. పంపిణీని ముమ్మరం చేయాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్.