విద్యుత్ రంగం పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ మెటార్ల పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ మోటార్లపై రైతులకు లేఖలు రాయండని.. వ్యవసాయ మెటార్లకు మీటర్లు వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలు చెప్పండని ఆదేశాలు జారీ చేశారు. రైతు పై ఒక్క పైసా కూడా భారం పడదని, బిల్లు అంతా ప్రభుత్వమే చెల్లిస్తుందని వివరించిండని పేర్కొన్నారు.
శ్రీకాకుళంలో పైలట్ ప్రాజెక్ట్ ఎలా విజయవంతం అయ్యిందో వివరించండని.. 33.75 మిలియన్ యూనిట్ల విద్యుత్ శ్రీకాకుళంలో ఆదా అయిన విషయాన్ని రైతులకు వివరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్. మోటార్లకు మీటర్లు కారణంగా మోటార్లు కాలిపోవని.. ఎంత కరెంటు కాలుతుందో తెలుస్తుందని పేర్కొన్నారు. నాణ్యంగా విద్యుత్ సరఫరా ఉంటుందనే విషయాన్ని వారికి వివరించాలని తెలిపారు. వ్యవసాయ పంపు సెట్ల కోసం దరఖాస్తు పెట్టుకున్న వారికి వెంటనే కనెక్షన్లు మంజూరు చేయాలని… ట్రాన్సాఫార్మర్ పాడైతే వెంటనే రీప్లేస్ చేయండన్నారు.