Big Breaking : మాజీ ఎమ్మెల్యేను పార్టీ నుంచి తొలగించిన సీఎం జగన్‌

-

వైసీపీ అధినేత, సీఎం జగన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యేను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించారు. అయితే.. పార్టీ ఇమేజ్ కు డ్యామేజ్ కలిగించే వారిని ఉపేక్షించబోనని గతంలోనే హెచ్చరించిన వైసీపీ అధినేత జగన్.. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణను సస్పెండ్ చేశారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి పత్రికా ప్రకటన వెలువడింది. ‘పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు… గుంటూరు జిల్లాకు చెందిన మాజీ శాసనసభ్యులు రావి వెంకటరమణను పార్టీ నుంచి సస్పెండ్ చేయడమైనది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫారసుల మేరకు పార్టీ అధ్యక్షుల వారు ఈ నిర్ణయం తీసుకోవడమైనది’ అంటూ ప్రకటనలో వైసీపీ కేంద్ర కార్యాలయం తెలిపింది.

గుంటూరు జిల్లా పొన్నూరు వైసీపీలో వర్గపోరు తీవ్ర స్థాయికి వెళ్లింది. ఎమ్మెల్యే కిలారి రోశయ్య వర్గం, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ వర్గం మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇటీవల పెదకాకాని మండల పార్టీ అధ్యక్షుడు పూర్ణాపై దాడి వ్యవహారం ఇరు వర్గాల మధ్య విభేదాలను మరింత పెంచింది. ఈ క్రమంలో రావి వర్గం ఆందోళన కార్యక్రమాలను చేపట్టింది. ఈ నేపథ్యంలో రావి వెంకటరమణపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుని, సస్పెండ్ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version