డిసెంబర్ నుంచి జనంలోకి సిఎం జగన్ వెళ్లనున్నారు. ఈ మేరకు స్పందన వీడియో కాన్ఫరెన్స్ లో సంకేతాలు ఇచ్చారు సిఎం జగన్. స్పందన వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ విలేజ్, వార్డు సచివాలయాల్లో తనిఖీలు చాలా ముఖ్యమైనవని.. అలసత్వం వహించిన వారిపై చర్యలకు వెనుకాడమన్నారు.
కలెక్టర్లు ప్రతివారం 2 సచివాలయాలు, జాయింట్ కలెక్టర్లు వారానికి 4 సచివాలయాలు, మున్సిపల్ కమిషనర్లు, ఐటీడీఏ పీఓలు, సబ్ కలెక్టర్లు వారానికి నాలుగు సచివాలయాలను తప్పనిసరిగా స్పందించాలని పేర్కొన్నారు.
వచ్చే నెల నుంచి ఎమ్మెల్యేలు కూడా వారానికి నాలుగు సచివాలయాలను సందర్శించాలని.. డిసెంబర్ నుంచి నేను కూడా సచివాలయాలను సందర్శిస్తానని వెల్లడించారు. ప్రతి పర్యటనలో కూడా నేను సచివాలయాలను చూస్తానని.. గ్రామ, వార్డు సచివాలయాల సందర్శన చేస్తున్న సమయంలో ఏయే అంశాలపై దృష్టిపెట్టాలో మార్గదర్శకాలు విడుదల చేస్తామన్నారు. సెప్టెంబరు 24, 25 తేదీల్లో సిటిజన్ అవుట్‌రీజ్ కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన కలిగించాలని పేర్కొన్నారు.