విపక్షాలకు కేసీఆర్ సవాల్.. ముందస్తు ఎన్నికల తేదీ చెప్తే అసెంబ్లీని రద్దు చేస్తా..

-

గత మూడు రోజులుగా తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలపై సమీక్ష సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. అయితే అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీజేపీ నేతలపై, కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రపంచ దేశాలలో ఎక్కడా లేని విధంగా ఇండియాలో ఉన్న 80 కోట్ల ఎకరాల భూమిలో 50 శాతం అంటే 40 కోట్ల ఎకరాల భూమి వ్యవసాయానికి అనుకూలంగా ఉందన్నారు. మనకు అమెరికా, చైనా తరహాలో 4వేల టీఎంసీల నీటి ప్రాజెక్టులు వద్దా అని కేసీఆర్‌ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో అధికారంలోకి వచ్చే అర్హత అన్ని పార్టీలకు ఉందన్న కేసీఆర్‌.. మా ప్రచారం మేం చేసుకుంటాం.. వాళ్ల ప్రచారం వాళ్లు చేసుకుంటారన్నారు.

ఫైనల్‌గా జడ్జిమెంట్ ఇవ్వాల్సింది ప్రజలని, ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర వహించాలన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను ప్రజలు ఎట్టి  పరిస్థితుల్లో వదులుకోరని కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. పీకే నాకు ఫ్రెండ్ మాత్రమే.. ఆయన నాకు చెప్పేదేముంటుంది.. పీకే లాంటి ఫ్రెండ్స్ నాకు చాలా మంది ఉన్నారని ఆయన వెల్లడించారు. మూడు, నాలుగు పార్టీలతో ఫ్రంట్ పెడితే ఏమొస్తుంది.. ఆ కిచిడీ ఫ్రంట్ నాలుగురోజులు కూడా నిలవదన్నారు. అంతేకాకుండా.. ముందస్తు ఎన్నికల తేదీ చెప్తే తాను అసెంబ్లీని రద్దు చేస్తా.దమ్ముంటే ఎన్నికల తేదీని ఖరారు చేయాలంటూ.. విపక్షాలకు సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version