సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న కేసీఆర్… ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో భేటీ… !

-

థర్డ్ ఫ్రంట్ ఏర్పాటులో కీలకంగా వ్యవహరిస్తున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్.  ఎన్డీయేతర సీఎంలతో వరసగా భేటీ అవుతున్నారు. మరోవైపు కేంద్రం, బీజేపీ ప్రభుత్వంపై విపరీతమై విమర్శలు చేస్తున్నారు. కేంద్రం నిర్ణయాలను తప్పుబడుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈరోజు సాయంత్రం సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో భేటీ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఇప్పటికే థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని.. దేశంలో యూపీఏ, ఎన్డీయేతర కూటమి అవసరం ఉందని కేసీఆర్ పలు మార్లు తెలిపారు. దేశ రాజకీయాల్లో ముఖ్య పాత్ర పోషిస్తా అని కేసీఆర్ అన్న సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలోనే ఇటీవల మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో ముంబైలో భేటీ అయ్యారు. సీనియర్ నేత ఎన్సీపీ లీడర్ శరద్ పవార్ తో కూడా భేటీ అయ్యారు. గతంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, కేరళ సీఎం పినరయి విజయన్ కూడా కేసీఆర్ సమావేశం నిర్వహించారు. కేంద్రం తీరు, బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు సీఎం కేసీఆర్. గతంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో కూడా ఫోన్ లో మాట్లాడారు. కేసీఆర్ కు మద్దతు తెలిపారు. మాజీ ప్రధాని దేవెగౌడ కూడా కేసీఆర్ పోరాటానికి మద్దతు తెలిపారు. త్వరలోనే బెంగళూర్ వస్తానని సీఎం కేసీఆర్ దేవెగౌడలో అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version