నేడు ఢిల్లీకి కేసీఆర్… ధాన్యం కొనుగోలుపై కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకే..

-

తెలంగాణ రాష్ట్రంలో యాసంగి వరి ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రాన్ని కోరేందుకు నేడు సీఎం కేసీఆర్, మంత్రులు, అధికారాలు ఢిల్లీకి వెళ్లనున్నారు. నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో కేసీఆర్ ఈ విషయాన్ని తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, సివిల్ సప్లై మంత్రి గంగుల కమలాకర్ లతో పాటు ఆయా శాఖల అధికారులు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో పాటు ప్రధాని మోదీని కూడా కలిసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. చివ‌రి ప్ర‌య‌త్నం గా రేపు ఢిల్లీ వెళ్ల‌నున్న‌ట్టు తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ తెలిపారు.

కేంద్రం స్పందన తరువాత భవిష్యత్ కార్యాచరణ సిద్దం చేసేందుకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధం అయింది. దాదాపు 2,3 రోజులు సీఎం ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. ధాన్యం సమస్యతో పాటు తెలంగాణ ఏర్పాటు అనంతరం నుంచి పరిష్కారం కాని అనేక సమస్యలను కేంద్రం ద్రుష్టికి తీసుకు వెళ్లేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారు.

వీటితో పాటు ఢిల్లీలో నిర్మిస్తున్న తెలంగాణ భవన్ నిర్మాణాన్ని కూడా కేసీఆర్ పరిశీలించనున్నారు. పనులు ఎక్కడి దాకా వచ్చాయనే వివరాలను తెలుసుకోనున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version