త‌ల్లి పై కోపంతో అబ్బాయి ని చంపిన బాబాయి

-

వ‌దిన మీద కోపాన్ని అబ్బాయి పై చూపించాడు ఒక కిరాత‌క బాబాయి. రంగ రెడ్డి జిల్లా లో ని మైలార్ దేవిపల్లి లో పోలీస్ స్టేష‌న్ లో దారుణం చోటు చేసుకుంది. వ‌ద‌న త‌న కాపురంలో గొడ‌వలు పెడుతుంద‌ని కోపం తో 4 సంవత్సరాల బాలుడుని దారుణ హత్య చేశాడు. ల‌క్మీగూడ రాజీవ్ గృహ‌క‌ల్ప ప్రాంతంలో మ‌హేశ్వ‌రి, వినోద్ కుమార్ రెడ్డి దంప‌త‌లు నివాసం ఉంటున్నారు. వీరికి ఒక నాలుగు సంవ‌త్స‌రాల ల‌క్ష్మీ న‌ర్సింహ (4) అనే కుమారుడు ఉన్నాడు.

అయితే మ‌హేశ్వ‌రీ కి ఒక చెల్లెలు ల‌క్ష్మీ ఉంది. ల‌క్ష్మీ కి ఆమె భ‌ర్త వీరేశ్ కు మ‌ద్య త‌ర‌చూ విబేధాలు వ‌స్తుంటాయి. దీనికి కార‌ణం మ‌హేశ్వ‌రీ యే అని వీరేశ్ అనుమానం వ్య‌క్తం చేశావాడు. దీంతో ఒక రోజు మ‌హేశ్వ‌రీ కుమారున్ని శ‌నివారం ఉదయం ఇంటి నుండి బయటకు తీసుకొని వెళ్లాడు. సాయంత్రం బాలుడిని గొంతు కోసి హత్య చేసి వీరేశ్ పారారీ అయ్యాడు. విష‌యం తెలుసుకున్న కుటుంబ సభ్య‌లు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. హంతకుడు విరేశం కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version