ఈ నెల 13 నుంచి కేసీఆర్ రెండో విడత ప్రచారం

-

తెలంగాణ ఎన్నికల్లో అందరి కంటే ముందు అభ్యర్థులను ప్రకటించి కేసీఆర్.. ప్రత్యర్ధి పార్టీల కంటూ దూకుడు మీదున్నారు. తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రజా ఆశీర్వాద సభలు పేరుతో తొలి విడత నవంబర్ 9న వరకు కేసీఆర్ సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. నామినేషన్లు ప్రారంభమయ్యేలోపు 26 చోట్ల ప్రచారం పూర్తి చేసారు. మొత్తంగా కేసీఆర్ 17 రోజుల్లో 41 బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. తాజాగా కేసీఆర్ నియోజకవర్గాల రెండో షెడ్యూల్ ఖరారైంది.

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గాల పర్యటన రెండో షెడ్యూల్ ఖరారైంది. ఇప్పటికే అక్టోబర్ 15 నుంచి ప్రారంభమైన అధినేత పర్యటనలు గురువారం(నవంబర్ 3, 2023) నాటికి 12 రోజుల్లో 30 నియోజకవర్గాల్లో విజయవంతమయ్యాయి. ఈ నెల 5 నుండి 8 వ తేదీ వరకు మరో 11 నియోజకవర్గాల్లో సీఎం పర్యటన చేపట్టనున్నారు.

ఇదే షెడ్యూల్
• 13-11-2023 – దమ్మపేట్ ( అశ్వారావుపేట), బూర్గంపాడు( భద్రాచలం,పినపాక, నర్సంపేట.

• 14-11-2023 – పాలకుర్తి,హలియ ( నాగార్జున సాగర్),ఇబ్రహీంపట్నం.

• 15-11-2023 – బోధన్, నిజామాబాద్ ( అర్బన్), ఎల్లారెడ్డి,మెదక్.

• 16-11-2023 – అదిలాబాద్,బోథ్,నర్సాపూర్, నిజామాబాద్ ( రూరల్).

• 17-11-2023 – కరీంనగర్,చొప్పదండి,హుజూరాబాద్, పరకాల.

• 18-11-2023 – చేర్యాల( జనగాం).

• 19-11-2023 – అలంపూర్,కొల్లాపూర్,కల్వకుర్తి, నాగర్ కర్నూలు.

• 20-11-2023 – మానకొండూర్,నకిరేకల్,స్టేషన్ ఘనపూర్,నల్గొండ.

• 21-11-2023 – మధిర,వైరా,డోర్నకల్,సూర్యాపేట.

• 22-11-2023 – తాండూరు,కొడంగల్, పరిగి,మహబూబ్ నగర్.

• 23-11-2023 – మహేశ్వరం,జహీరాబాద్,వికారాబాద్,పఠాన్ చెరువు.

• 24-11-2023 – మంచిర్యాల,భూపాలపల్లి,రామగుండం, ములుగు.

• 25-11-2023 – హైదరాబాద్

• 26-11-2023 – ఖానాపూర్,వేములవాడ,జగిత్యాల,దుబ్బాక.

•27-11-2023 – షాద్ నగర్, అందోల్ ,సంగారెడ్డి,చేవెళ్ల.

• 28-11-2023 – వరంగల్ ( ఈస్ట్, వెస్ట్),గజ్వేల్.

Read more RELATED
Recommended to you

Exit mobile version