కాంగ్రెస్ దద్దమ్మలకు గెలవడం చేతకాదు: సీఎం కేసీఆర్

-

ఈ రోజు మధ్యాహ్నం దుబ్బాకలో అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రచారం చేస్తున్న సమయంలో రాజు ఆయనపై కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన సీఎం కేసీఆర్, తాజాగా మరోసారి నారాయణఖేడ్ ప్రచార సభలో మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ ఈ దాడి వెనుక ఉన్నది అన్న కోణంలో వారిపై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు సేవచేసి గెలిచే దమ్ము లేదు కానీ, వీరంతా దద్దమ్మలు అంటూ కామెంట్ చేశారు కేసీఆర్. ప్రజాస్వామ్య రాజ్యంలో ఇలా దాడులు జరగడం ఇదే మొదటిసారి అని.. ఇలాంటివి ప్రజలు హర్షించేవి కావంటూ కేసీఆర్ కాంగ్రెస్ ఇజ్జత్ తీశాడు. ప్రజల మధ్యలో నువ్వు ఏమిటో ? ఎంత దమ్ముందో చూపించు? అంటే కానీ ఇలా దొడ్డి దారిన దాడులు చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ సీఎం కేసీఆర్ కామెంట్స్ చేశాడు.

కాగా తెలంగాణాలో ఎన్నికలు నవంబర్ 30న జరగనున్నాయి… మరి ఎవరు గెలవనున్నారు అన్నది తెలియాలంటే అప్పటి వరకు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version