“ప్రేమమ్” డైరెక్టర్ షాకింగ్ నిర్ణయం !

-

నాగ చైతన్య హీరోగా నటించిన “ప్రేమమ్” మూవీ మలయాళంలో ఘన విజయం సాధించిన మూవీ “ప్రేమమ్” కు రీమేక్ గా తెరకెక్కించారు. రెండు భాషలలోనూ హిట్ అందుకుని నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది. ఈ సినిమాను డైరెక్ట్ చేసిన అల్పోన్సో పుత్రన్ సంచలన నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. సినిమాలకు దూరం అవుతున్నాను అంటూ ప్రకటించి షాక్ ఇచ్చాడు.. పుత్రన్ సోషల్ మీడియా వేదికగా నేను ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ తో బాధపడుతున్నా, కాబట్టి ఎవరికీ భారం కదలుచుకోకూడదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశాడు పుత్రన్. నా ఈ సమస్యను ఎవరి మీద పెట్టాలని అనుకోవడం లేదు, అందుకే సినిమా ఫీల్డ్ నుండి వైదొలుగుతున్నా అంటూ భారమైన మనసుతో ప్రేక్షకులకు తెలియచేశాడు. సినిమాలు అంటే తనకు ఎంత ఇష్టమో తెలిసి కూడా ఈ నిర్ణయం తీసుకోవడం చాలా కష్టంగా ఉందంటూ బాధపడ్డాడు పుత్రన్.

కాగా ఈ పోస్ట్ ను పెట్టిన కాసేపటికే ఈయన డిలీట్ చేయడం విశేషం.. మరి తన నిర్ణయాన్ని ఏమైనా మార్చుకుంటారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version