తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా వరి ధాన్యం కొనుగోలు అంశంపై తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వరి పంట వేయడం పై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎవరూ కూడా యాసంగి కాలంలో… వరి పంట వేయకూడదని సూచనలు చేశారు. యాసంగి లో వారికి బదులు ఇతర పంటలు వేసుకుంటే లాభాలు బాగా వస్తాయని చెప్పారు. సీడ్ కంపెనీకి.. అనుబంధమై ఉన్న రైతులు వరి పంట పండించుకోవచ్చు అని తెలిపారు.
కానీ తెలంగాణ బిజెపి నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచనలు చేశారు సీఎం కేసీఆర్.
రైతులు పండించే దాన్యం పై బండి సంజయ్ ఏమి మాట్లాడలేదు..వడ్ల విషయం తప్ప అన్ని మాట్లాడారని మండిపడ్డారు. గట్టిగా నిలదీస్తే దేశ ద్రోహి.. టీఆరెస్ పార్టీ రాష్ట్రపతి ఎన్నిక సమయంలో సపోర్ట్ చేస్తే దేశ ద్రోహి కదా..? అని నిలదీశారు.
ఉన్నది ఉన్నట్లు చెబితే దేశ ద్రోహి ? అర్బన్ నక్సలైట్స్,నక్సల్స్ గా ముద్ర వేస్తారని మండిపడ్డారు. మేఘాలయ గవర్నర్ దేశ ద్రోహి ఏ నా..? చైనా అక్రమస్తుంది అంటే దేశ ద్రో హా అని ప్రశ్నించారు.
తెలంగాణ లో దాన్యం కొంటాదా.. ? లేదా ? క్లారిటీ ఇవ్వండి.. సూటిగా ప్రశ్నిస్తున్నానని ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర బీజేపీ సమాధానం ఇచ్చే వరకు వదలమని.. బీజేపీ వాళ్ళలాగా చీఫ్ గా మేము మాట్లాడమనీ మండిపడ్డారు.