టీఆర్ఎస్ అధినేత.. తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. దేశంలో అన్ని రాష్ట్రాలపై పట్టు సాధించేందుకు.. సీఎం కేసీఆర్ వ్యూహాలు పన్ను తున్నారు.. జాతీయ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి రూపకల్పన సన్నాహాల్లో భాగంగా టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఈనెల 20న వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలతో భేటీ కానున్నారు. ఇదే అంశమై పార్టీ ముఖ్యనేతలు, ఆర్థికవేత్తలతో సమావేశమైనట్లు తెలిసింది. ఇప్పటికే దేశంలో ప్రముఖ
ఆర్థికవేత్తలతోనూ కేసీఆర్ చర్చించారు.
దేశంలో కొత్త వ్యవసాయ విధాన రూపకల్పనపై ఈనెల 20న ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలతో సమావేశమై చర్చించనున్నారు కేసీఆర్. ఇదిలా ఉంటే.. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో బీజేపీకి వ్యతిరేకంగా.. కూటమిని తయారు చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే తమ కలిసి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న రాష్ట్రాల సీఎంలతో కేసీఆర్ వరుసగా భేటీ అవుతున్నారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ తనదైన ముద్ర వేస్తారో చూడాలి మరి..