పరిస్థితిని ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధం కావాలి : సీఎం సోమేశ్‌

-

భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలో నెలకొన్న పరిస్థితులను పర్యవేక్షించాలని సీఎం కేసీఆర్‌ సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌కు ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే వరద సహాయక చర్యలు వేగవంతం చేయాలని సీఎస్‌ సోమేశ్ కుమార్ అధికారులకు ఆదేశించారు. భద్రాచలం వద్ద గోదావరి ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో వరద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, ఇరిగేషన్‌ ఉన్నతాధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి జిల్లాలో చేపడుతున్న సహాయక, పునరావాస చర్యలను సమీక్షించారు సీఎస్‌ సోమేశ్.

ఈ టెలికాన్ఫరెన్స్ లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా పాల్గొన్నారు. వరద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూన్నట్లు మంత్రి తెలిపారు. సకాలంలో వరద సహాయాన్ని అందించినందుకు ముఖ్యమంత్రికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. జిల్లాకు ఎన్‌డిఆర్‌ఎఫ్‌, ఆర్మీ, సింగరేణి, రెస్క్యూ టీమ్‌లను తరలించారు. ఆ టీమ్ లను భద్రాచలం, కొత్తగూడెం పట్టణాల్లో ఉంచినట్లుయైతే, వరద సహాయక చర్యలు సమర్థవంతంగా చేపట్టేందుకు అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. వరద నీరు 80 అడుగులకు చేరినా పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధం కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.

ముంపునకు గురయ్యే గ్రామాలు, ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయించి ప్రత్యేక పునరవాస శిబిరాలకు తరలించాలన్నారు. ఇప్పటికే భద్రాచలంలో 10 ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు, ఆర్మీకి చెందిన 5 బృందాలు, సింగరేణి రెస్క్యూ టీమ్‌లు సిద్దంగా ఉన్నాయని ఆయన తెలిపారు. వరదల సమయంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చూడాలని ప్రధాన కార్యదర్శి పునరుద్ఘాటించారు. ఆస్తినష్టం జరగకుండా కూడా సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలి. అన్ని సహాయక శిబిరాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ రాత్రికి ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్ ఐటీసీ భద్రాచలం వద్ద ఉంటుందని తెలిపారు. సహాయక చర్యలలో జిల్లా యంత్రాంగానికి తోడ్పాటుగా మరో నలుగురు సీనియర్ RDOలను నియమించారు. ఇవాళ రాత్రికి 4 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు బోట్లు, బస్సులు, ట్రక్కులు కూడా భద్రాచలంనకు తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు. సహాయక చర్యలను సమన్వయం చేసేందుకు, పర్యవేక్షించేందుకు పోలీసు ఉన్నతాధికారులకు కూడా బాధ్యతలు అప్పగించినట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version