ఫ్యాక్ట్ చెక్: ఆర్బీఐ లబ్ధిదారునికి రూ.4 కోట్ల 59 లక్షలు అందజేస్తానని పేర్కొందా?

-

సోషల్ మీడియాలో ఏదొక వార్త వైరల్ అవుతూ ఉంటుంది.. కొన్ని ప్రజలను మోసం చేసేవి కూడా ఉంటాయి. ఇటీవల కాలంలో ఫేక్ న్యూస్ లకు సంభందించిన వార్తలు ఎక్కువగా ప్రచారంలో ఉన్నాయి. తాజాగా మరో వార్త నెట్టింట చక్కర్లు కోడుతుంది.. ఆర్బీఐ బ్యాంక్ లబ్దిదారునికి రూ. 4 కోట్ల 59 లక్షలు అందజేస్తోందని నకిలీ వార్త వినిపిస్తోంది.

ఒక నోటిఫికేషన్ లో ఈ మెసేజ్ ఉంది.. అయితే ఈ వార్త పై స్పందించిన అధికారులు అలర్ట్ అయ్యారు.. రిజర్వ్ బ్యాంక్ అటువంటిది చెప్పలేదని,చెల్లింపులు/నిధులు ఏవీ అందించలేదని స్పష్టం చేసింది. RBI ఎప్పుడూ వ్యక్తిగత సమాచారం కోసం కాల్ చేయదు లేదా ఇమెయిల్‌లను పంపదు..

ఈ విషయం పై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పష్టం చేసింది..రిజర్వ్ బ్యాంక్ అటువంటివి చెయ్యలెదని తేల్చి చెప్పింది. కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌లను కూడా తనిఖీ చేసాము, కానీ ఈ ఆఫర్ గురించి ఎటువంటి సమాచారం లేదని చెప్పారు.ఇటువంటి వాటిని నమ్మి మోస పోవద్దని అధికారులు హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version