ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడితే గడ్డం గీసుకోను అనే పంచాయతీ తప్ప ఏం లేదన్నారు. ఉత్తమ్ గడ్డం తీసుకుంటే మాకేంది.. తీసుకోక మాకేంది.. ప్రజలకు పని కావాలి. నీళ్లు కావాలి..కరెంట్ కావాలి అన్నారు. కాంగ్రెస్ లో డజన్ మంది ముఖ్యమంత్రులున్నారని మండిపడ్డారు సీఎం కేసీఆర్. ఏ వాడ కట్ట చూసినా ముఖ్యమంత్రే.. నన్ను గెలిపించురి నేను ముఖ్యమంత్రి అయితా.. అసలు కాంగ్రెస్ గెలిచే పరిస్థితిలో లేదన్నారు సీఎం కేసీఆర్. వ్యక్తి చరిత్ర ఏందో తెలుసుకోవాలి అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
రాష్ట్రాన్ని కాంగ్రెస్ 50 ఏళ్లు పరిపాలించింది. కానీ కాంగ్రెస్ సరిగ్గా పాలిస్తే కష్టాలు ఎందుకు ఉండేవి. ఎన్నికల్లో ప్రజలు గెలవాలి. ప్రజాశక్తి గెలవాలి. ఈ బాధ శాశ్వతంగా పరిస్కరించే బాధ్యత నాది.హుజూర్ నగర్ లో సైదిరెడ్డిని బంఫర్ మేజార్టీతో గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ది బాధ్యత తనదే అని సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో ప్రకటించారు. సైదిరెడ్డిని గెలిపిస్తే లిప్ట్ లు, ఇండస్ట్రియల్ పార్క్ తో పాటు అన్ని ఏర్పాటు చేస్తామన్నారు.