యాదాద్రి చేరుకున్న సీఎం కేసీఆర్‌

-

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్‌ రావు పుణ్య క్షేత్రమైన యాదాద్రి చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ప్రగతి భవన్‌ నుంచి బయలు దేరిన సీఎం కేసీఆర్‌… కాసేపటి క్రితమే యదాద్రి చేరుకున్నారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి, విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీత, శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఉన్నారు.  యదాద్రి చేరుకున్న సీఎం కేసీఆర్‌ కు ఘన స్వాగతం పలికారు ఆలయ సిబ్బంది మరియు అధికారులు.

KCR-TRS

అనంతరం ఆలయ పునర్మి ర్మాణ పనులను ఏరియల్‌ వ్యూ ద్వారా పరిశీలించారు సీఎం కేసీఆర్‌. ఇక మరీ కాసేపట్లోనే… ఆలయ పునః ప్రారంభ తేదీలను కూడా ప్రకటించే అవకాశం ఉంది. యాద్రాద్రి పునః ప్రారంభం తేదీ, ముహుర్తాన్ని త్రిదండి చినజీయర్‌ స్వామి.. ఇప్పటికే ఖరారు చేశారు. ఆలయ ప్రారంభం రోజున నిర్వహించే.. మహా సుదర్శన యాగం వివరాలు, తేదీలను సీఎం కేసీఆర్‌ ప్రకటించనున్నారు.  ఇవాళ సాయంత్రం వరకు యదాద్రిలోనే సీఎం కేసీఆర్‌ ఉం డే అవకాశాలు ఉన్నాయి.  కాగా.. ఇప్పటికే యదాద్రి పనులు పూర్తి అయిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version