పాలమూరులో పచ్చని పంటలు పండే రోజు రాబోతోంది : సీఎం కేసీఆర్‌

-

మహబూబ్‌నగర్‌ పర్యటనలో భాగంగా సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించారు.  అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ.. గతంలో వలసలు ఆత్మహత్యలు, ఆకటి చావులతో పాలమూరులో భయంకరమైన పరిస్థితులు ఉండేవని, అన్ని జిల్లాల్లో అద్భుతమైన కలెక్టరేట్లు నిర్మించుకున్నామన్నారు. ఆ ఫలితాలు ఇప్పుడు మీ ముందు ఉన్నాయని, ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. అంతేకాకుండా ‘మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేసుకున్నాం. మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేసుకున్నాం. ఈ రోజు పాలమూరు అంటే కరువు జిల్లా కాదు పచ్చటి జిల్లా. మన నీటి వాటా తేల్చడం లేదు. 25 లక్షల ఎకరాల్లో పాలమూరులో పచ్చని పంటలు పండే రోజు రాబోతోంది. మహబూబ్‌నగర్‌కు పరిశ్రమలు పెద్ద సంఖ్యలో వస్తున్నాయి. మంచినీరు, కరెంట్‌ కొరత తీరింది.

కర్నాటక, మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ప్రజలు తమను తెలంగాణలో కలపాలని కోరుతున్నారు. ఇవాళ రైతు ఏ కారణంలో చనిపోయిన వెంటనే రూ.5లక్షలు ఇస్తున్నాం. తెలంగాణ రాకముందు పాలమూరులో మెడికల్‌ కాలేజీ వస్తుందని ఎవరైనా ఊహించారా.. జిల్లాలో 5 మెడికల్‌ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. ఇదీ మనం సాధించిన ప్రగతి. డైలాగులు, ఉత్తమాటలతో అభివృద్ధి కాదు. మనతో సమానంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యపడుతుంది. చేతకాని కేంద్ర ప్రభుత్వం వల్ల తెలంగాణ 3 లక్షల కోట్లు నష్టపోయింది. రాష్ట్రానికి వచ్చి మోడీ డంబాచారాలు చెబుతున్నారు. కేంద్రం తెలంగాణకు నిధులు ఇవ్వడం లేదు. కాళ్లలో కట్టెలు పెడతం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.’ అని సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version