మత కలహాలు పెట్టి.. హిజాబ్ పంచాయతీ పెడుతున్నారు: సీఎం కేసీఆర్

-

దేశంలో ఫెడరలిజం ప్రమాదంలో పడిందని సీఎం కేసీఆర్ అన్నారు. దేశం నలుమూలల 11 రాష్ట్రాల నుంచి వస్తున్నారని ఆయన వెల్లడించారు. బెంగళూర్ దేశంలోనే సిలికాన్ వ్యాలీగా ఉందని.. హైదరాబాద్ దాని తర్వాత స్థానంలో ఉందని ఆయన వెల్లడించారు. బెంగళూర్, హైదరాబాద్ లో అనేక దేశాల వాళ్లు పని చేస్తుంటారని సీఎం కేసీఆర్ అన్నారు. మతకలహాలు పెట్టి ప్రజల్ని విడదీసి ప్రజల్ని తన్నుకునే పరిస్థితి ఉంటే… బెంగళూర్ లో హిజాబ్ పంచాయతీ పెడుతున్నారని.. ప్రజలు తొడుక్కునే ఆహర్యంతో గవర్నమెంట్కు ఏం సంబంధం అని ప్రశ్నించారు. సంకుచిత వ్యవహారాలు చేస్తున్నారని.. ఈ దేశం ఎటుపొతుందని కేసీఆర్ అన్నారు. మతకలహాలు ఉంటే పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఇదిపూర్తిస్థాయిలో పెడధోరణి అని ఇది దేశానికి మంచిది కాదని ఆయన అన్నారు. దేశ, రాష్ట్ర యువత ఆలోచించాలని కోరారు. ఎన్నో దశాబ్ధాల తరబడి అనేక మంది శ్రమపై నిర్మితమైన ఈవాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మన కన్నా ఆర్థిక నిర్వహణలో దేశం పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. 2014లో యూపీఏ గవర్నమెంట్ లో నానా నిందు మోపి ఎన్డీయే అధికారంలోకి వచ్చిందని ఆయన అన్నారు. యూపీఏ కన్నా దిగజారిందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version