ఆర్థిక క్రమశిక్షణ కఠినంగా పాటించడంతో దేశంలోని 28 రాష్ట్రాల్లో అప్పుల్లో 25వ స్థానంలో ఉన్నామని.. మన కన్నా 24 రాష్ట్రాలు ఎక్కువగా అప్పుచేశామని.. మన అప్పుల శాతం కేవలం 23 శాతమే అని సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ పాలించే రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాలు ఎక్కువ అప్పులు చేశాయని కేసీఆర్ అన్నారు. ఇప్పుడు అప్పులు కూడా వనరులే సమీకరణే అని ఆయన అన్నారు. దేశానికి పెద్దగా వ్యవహరించే కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం వాళ్ల పాలసీలు కరెక్ట్ గా లేదని సీఎం విమర్శించారు. బలమైన కేంద్రం… బలహీనమైన రాష్ట్రాలుగా పాలసీని కేంద్రం అవలంభిస్తోందని విమర్శించారు.
అప్పుల్లో తెలంగాణ దేశంలోనే 25వ స్థానంలో ఉంది: సీఎం కేసీఆర్
-