సీఎం కేసీఆర్ ఈరోజు తెలంగాణ భవన్ లో పార్టీ నేతలతో కీలక భేటీ నిర్వహించారు. కేసీఆర్ అధ్యక్షతన పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పోరేషన్ చైర్మన్లు, ఇతర రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. అయితే ఈసమావేశంలో పార్టీ నాయకులకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాాలు జారీ చేశారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోళ్లు, బొగ్గు గనుల వేలంపై కేంద్రంలో దీర్ఘకాలిక పోరుకు సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. పార్టీ కోసం పనిచేసే వారికి పదవులు తప్పకుండా వస్తాయని సీఎం కేసీఆర్ అన్నారు. నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.
ధాన్యం కొనుగోలు, సింగరేణి బొగ్గు గనుల వేలంపై మోదీ సర్కార్ అనుసరిస్తున్న విధానంపై నాయకులు పోరాటం చేయాలని నాయకులుకు సీఎం కేసీఆర్ సూచించారు. కేంద్రం తీరు వల్ల రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని నేతలకు సూచించారు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు అన్ని కార్యక్రమాల్లో భాగం చేయాలని దిశానిర్థేశం చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం ఆదేశించారు. దళితబంధు పథకంపై ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని నేతలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.