గ్రామస్థులతో సహపంక్తి భోజనం.. స్వయంగా వడ్డించిన సీఎం కేసీఆర్

-

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామానికి మంగళవారం మధ్యాహ్నం సుమారు ఒంటి గంట సమయంలో చేరుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు. వాసాలమర్రి గ్రామానికి సిఎం కెసిఆర్.. తొలుత గ్రామసభ వేదికపైకి వచ్చి అందరికీ అభివాదం చేశారు. ఆ తర్వాత గ్రామస్తులందరితో కలిసి భోజనశాలకు చేరుకున్నారు. అక్కడ టేబుళ్లపై కూర్చున్న గ్రామస్తుల దగ్గరికి వెళ్లి, ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ, భోజనం చేయాల్సిందిగా కోరారు.తమను ముఖ్యమంత్రి స్వయంగా పలకరించడంతో కొందరు గ్రామస్తులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

మరికొందరు తమ సమస్యలను సీఎం కేసీఆర్ కు చెప్పుకున్నారు. ఈ సమస్యలన్నింటినీ నోట్ చేసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు. గ్రామస్తులు భోజనం చేస్తున్న సమయంలో చాలాసేపు కలియదిరిగి, వారిని పలకరించిన తర్వాత సీఎం కేసీఆర్ వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. సీఎం కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో అక్కడ ఏకంగా23 రకాల వంటకాలు చేశారు. ఇక తన పక్కన కూర్చున్న గ్రామ మహిళలకు సీఎం కెసిఆర్ స్వయంగా వంటకాలను వడ్డించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version