ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ బెంగళూరు పర్యటన

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గురువారం బెంగళూరు పర్యటనకు బయలుదేరారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. ఈ మేరకు మధ్యాహ్నం మాజీ ప్రధాని దేవగౌడ నివాసానికి చేరుకుని.. ఆయనతో పలు విషయాలపై చర్చించనున్నారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు, జాతీయ రాజకీయాలు, రైతుల సమస్యలు, రాష్ట్రాల విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, భవిష్యత్ కార్యచరణపై మాజీ ప్రధాని దేవగౌడ, కుమారస్వామితో చర్చించనున్నారు.

cm-kcr-telangana

సీఎం కేసీఆర్ బెంగళూరు పర్యటన సందర్భంగా అక్కడ భారీ కటౌట్లతో ఉన్న ఫ్లెక్సీలు వెలిశాయి. దేశ్‌కి నేత అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ బెంగళూరు పర్యటనలో పలు అంశాలపై చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో జరగబోయే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల అంశాలపై కూడా మాట్లాడనున్నారు. సమావేశం ముగిశాక తిరిగి సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ రానున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version