ఇండియాలోనే అత్యంత పెద్ద కుటుంబం ఎక్కడ ఉందో తెలుసా?

-

ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి..20 లేదా 30 మంది ఉండేవారు..ఆ తర్వాత రాను రాను ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయి, సింగిల్ ఫ్యామిలీ లు ఉండేవి..అలాంటి కుటుంబాల వల్ల ఎటువంటి గొడవలు లేకుండా ఉండటం తో ప్రభుత్వం కూడ చిన్న కుటుంబ చింత లేని కుటుంబం అనే కాన్సెప్ట్‌లను తీసుకువచ్చింది.దాంతో ఉమ్మడి కుటుంబాలు అనేవి అక్కడక్కడా కనిపిస్తూ ఉన్నా కూడా కేవలం పుస్తకాలకు మాత్రమే పరిమితం అయ్యింది.

అలాంటి ఈ రోజుల్లో దేశంలో అత్యంత భారీ కుటుంబం ఒకటి ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక ఆలస్యం అందుకు ఆ ఫ్యామిలీ పూర్తీ వివరాలను ఒకసారి చూడండి..బీహార్‌లోని గయా జిల్లాలో ఓ కుటుంబంలో ఏకంగా నాలుగు తరాలవారు కలిసి జీవిస్తున్నారు.62 మంది కుటుంబ సభ్యులతో, ఐక్యతకు మారు పేరుగా నిలుస్తుందీ కుటుంబం. వీరంతా ఉమ్మడి కుటుంబానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంతమందికీ ఒకే వంటగదిలో భోజనం తయారు చేసి అందరూ కలిసి తింటారు. అంతేకాదు సామాజిక సేవలోనూ ఈ కుటుంబం ముందుంటుంది. బోధ్‌గయలో సామాజిక సేవకు ఉదాహరణగా నిలిచిన ‘కళ్యాణ్ కుటుంబం’ ఇతరులకు అనేక విషయాల్లో స్ఫూర్తిగా నిలిస్తోంది. సాధారణంగా ఇంట్లో నలుగురు, ఐదుగురు సభ్యులుంటేనే.. కలహాలతో నిండిపోతుంది.

ఈ కుటుంబ పెద్దలు కృష్ణ కన్నయ్య ప్రసాద్, రాధికా దేవి దంపతులు కుటుంబం మొత్తాన్ని ఐక్యంగా ఉంచడంలో ప్రముఖ పాత్రను పోషిస్తారు. ఒకటిన్నర ఎకరం విస్తీర్ణంలో 57 గదులతో ఇంటి నిర్మించి, ‘కళ్యాణ్ పరివార్ కాంప్లెక్స్’ గా దానికి పేరుపెట్టారు.ఆ ఇంటిలో 62 మంది కలిసి ఒకేసారి భోజనం చేస్తారు. ఈ ఉమ్మడి కుటుంబంలో 9 మంది అన్నదమ్ములు ఉన్నారు. వీరందరికీ స్వంత వ్యాపారాలున్నాయి. ఇక NGOల ద్వారా ఆ ప్రాంతంలోని పేదలు, నిస్సహాయులు, నిరుపేదలకు సేవ చేయడంలో బోధ్‌గయాలో కళ్యాణ్ పరివార్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది..విద్యా, వైద్యం వంటి వాటికి సహాయం చేస్తున్నారు.ఈ ఫామిలీకి స్థానికంగా మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం ఈ ఇంట్లో 12 జంటలు ఉన్నారు. ఈ ఉమ్మడి కుటుంబం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని సదరు అభిప్రాయ పడుతున్నారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version