మాజీ మంత్రి, హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఎపిసోడ్ అనంతరం…. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పనితీరు లో పూర్తిగా మార్పు వచ్చింది. ఎప్పుడు ఫామ్ హౌస్ లేదా ప్రగతి భావన్ లో ఉంటాడనే ఆరోపణలకు చెక్ పెడుతూ.. కేసీఆర్ ఇప్పుడు ప్రజల వద్దకు వెళుతున్నారు.
ఇందులో భాగంగానే.. ప్రస్తుతం జిల్లాల పర్యటనలో ఫుల్ బిజీ అయిపోయారు కెసిఆర్. అయితే రేపు యాదాద్రి జిల్లా లోని వాసాలమర్రి గ్రామానికి సిఎం కేసీఆర్ వెళ్లనున్నారు. ఇటీవలే దత్తత గ్రామం వాసాలమర్రి లో పర్యటించిన కెసిఆర్…. త్వరలో మళ్ళీ వస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే వాసాలమర్రి గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని చెప్పారు. ఇందులో భాగంగానే రేపు వాసాలమర్రి లో నిర్వహించే గ్రామ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు అధికారులు. కాగా ఈ నెల 4 న ముఖ్యమంత్రి కెసిఆర్ రాజన్న సిరిసిల్లా జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే.