దళిత బందు పథకాన్ని కేసీఆర్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారు. ఒక దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకునేందుకు ఈ పథకాన్ని తీసుకు వచ్చింది ప్రభుత్వం. ప్రస్తుతం ఈ పథకం నూటికి నూరుశాతం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ తరుణంలో దళిత బంధు పథకం పై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దళిత బంధు పథకం అమలు పై ప్రత్యేకంగా పోర్టులను అభివృద్ధి చేయడంతో పాటు మొబైల్ అప్లికేషన్ ను రూపొందించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.
సమగ్ర కుటుంబ సర్వే, అధికారులు సర్వే ఆధారంగా వచ్చిన డేటాబేస్, డిపిఆర్ లతో పాటు అన్ని అంశాలను ఇందులో పొందు పరచనున్నారు. యూనిట్ మంజూరు, ఇచ్చిన శిక్షణ, అమలు సమయంలో పురోగతి, ఆదాయ వేయాలని ఆన్లైన్ లో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈవిడ ద్వారా వచ్చే ఆదాయాన్ని అందుకోసం ఉండే ప్రత్యేక బ్యాంకు ఖాతాలోనే జమ చేసేలా లబ్ధిదారులకు ప్రోత్సహించ నున్నారు. తద్వారా ఫలితాలను కూడా విశ్లేషించ వచ్చు అని సర్కార్ ఆలోచన చేస్తోంది. పోర్టల్ ఆధారంగా మొబైల్ అప్లికేషన్ ను కూడా అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. దీనికోసం అధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు.