సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్.. పలు అంశాలపై కీలక చర్చ

-

మరికొద్ది సేపట్లో సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్ నిర్వహించనున్నరు. భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న గోదావరి పరివాహక ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ ఆదివారం పర్యటించనున్నారు. హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో సీఎం కేసీఆర్ హనుమకొండ నుంచి ఏటూరు నాగారం రోడ్డు నుంచి బయలుదేరారు. గూడెపహాడ్, ములుగు, గోవిందరావుపేట నుంచి మరికాసేపట్లో ఏటురు నాగారం చేరుకోనున్నారు. అనంతరం సీఎం కేసీఆర్ రోడ్డు మార్గం ద్వారానే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు.

సీఎం కేసీఆర్

ఏటూరు నాగారంలోని ఐటీడీఏ కార్యాలయంలో వరద పరిస్థితులపై సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ ప్రెస్‌మీట్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. అయితే ఈ సమావేశంలో ముంపు ప్రాంతాలకు పరిహారం ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే సీఎం కేసీఆర్ వెంబడి మంత్రులు హరీశ్ రావు, దయాకరరావు, ఎమ్మెల్సీ మధుసూధనాచారి, ఎమ్మెల్యేలు నరేందర్, గండ్ర వెంటక రమణ రెడ్డి, చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, స్మితా సబర్వాల్, కడియం శ్రీహరి.. తదితరులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version