పాపులేషన్ ప్రకారమే కేంద్రం నిధులు కేటాయిస్తామనడం సరైంది కాదు. మెరిట్ ప్రకారం కూడా నిధులు కేటాయించాలి అని సీఎం రేవంత్ అన్నారు. 50 శాతం పాపులేషన్ ప్రకారం నిధులు కేటాయిస్తే.. మెరిట్ ప్రకారం 50 శాతం నిధులు కేటాయించాలి. ఐపీఎస్ ల కేడర్ పై 2016లో రివ్యూ అయింది తెలంగాణకు 29 మంది కేడర్ రావాల్సి ఉంది. మూసి పునర్జీవనం కోసం 20 వేల కోట్లు అడుగుతున్నాం. సబర్మతి గంగా యమునాల ప్రాజెక్టులను ఇప్పటికే కేంద్రం ఆచరణలో పెడుతుంది.
రీజినల్ రింగ్ రోడ్డు పూర్తి చేయడంతో పాటు డైపోర్టు, బందర్‌పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే కావాలి.. దాంతోపాటు రైల్వే లైన్ కూడా కావాలి. మొత్తం ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఏర్పాటు చేయాలి అనేది మా లక్ష్యం. సెమీ కండక్టర్ల తయారీ కోసం తెలంగాణకు అవకాశం కల్పించాలని కోరాం. ఎస్ ఎల్ బీసీ పనులు పదేళ్ల నుంచి చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగింది. కాంగ్రెస్ హయాంలో 30 కిలోమీటర్లు పూర్తయింది. మధ్యలో పనిచేయకపోవడం వల్ల మిషనరీ బేరింగ్స్ కూడా పాడయ్యాయి. కెసిఆర్ కు లాభం లేదు అనుకునే కమిషన్లు రావనుకునే ఎస్ఎల్బీసీ పనులను ముందుకు తీసుకెళ్లలేదు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును కంప్లీట్ చేస్తాం..పూర్తి వివరాలు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్తేనే తెలుస్తుంది. కాలేశ్వరం అవినీతి నాసిరకం వల్ల ఇన్సిడెంట్ జరిగింది అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.