మా రాష్ట్రానికి వచ్చి నన్నే బెదిరిస్తారా..? : సీఎం రేవంత్ రెడ్డి

-

రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే బీజేపీ కుట్రను తన వద్ద ఆధారాలు ఉన్నాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘నేను కేసులకు భయపడే వ్యక్తిని కాదు. మోడీ అబద్దాలు చెబుతున్నారు. రాజ్యాంగాన్ని మార్చడానికి కమిషన్ వేశారు. దమ్ముంటే రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పి ఓట్లు అడగండి. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రెస్ మీట్ లో కీలక విషయాలను వెల్లడిస్తానని తెలిపారు. ఎన్నికల ప్రచారం మానేసి ఢిల్లీ పోలీసుల ఎదుట హాజరు కావాలా..? మా రాష్ట్రానికి వచ్చి నన్నే బెదిరిస్తారా..?’ అని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి.

హైదరాబాద్ దాహార్థి తీర్చేందుకు అదనంగా కృష్ణా జలాలు అడిగితే కేంద్రంలోని బీజేపీ ఇవ్వలేదని.. మోడీ తెలంగాణను అవమానించి ఇక్కడికీ వచ్చి ఓట్లు అడుగుతున్నారని ఫైర్ అయ్యారు. 20 ఏళ్లలో ఎన్నో ఆటుపోట్లు చూశానని.. గుజరాత్ నుంచి వచ్చి తెలంగాణలో పెత్తనం చేద్దామనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్ ఆధిపత్యానికి, తెలంగాణ పౌరుషానికి ఈ ఎన్నికల్లో పోటీ అన్నారు. బీజీపీ దగ్గర సీబీఐ, ఈడీ, ఐటీ ఉంటే.. తమ దగ్గర నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలున్నారని రేవంత్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version