సర్పంచ్ ఎన్నికలపై కాసేపట్లో సీఎం రేవంత్ సమీక్ష

-

రాష్ట్రంలో జరగాల్సిన సర్పంచ్ ఎన్నికలపై కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ కీలక సమావేశం నిర్వహించనున్నారు.

ఈ సమావేశంలో మంత్రి సీతక్కతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు, బీసీ డెడికేషన్ కమిషన్ చైర్మన్, తదితరులు పాల్గొననున్నారు. అయితే, రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికలను వేసవి తర్వాత నిర్వాహిస్తారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు పథకాలు పూర్తిగా లబ్దిదారులకు అందాకే ఎన్నికలకు వెళ్లాలని ప్రజాప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.లేనియెడల ఎన్నికల్లో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత తప్పదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version