మేడ్చల్ జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. స్కూల్ ఫీజు చెల్లించలేదని యాజమాన్యం విద్యార్థి పట్ల దారుణంగా ప్రవర్తించారు. స్కూల్ టైమింగ్స్ అయిపోయినా ఇంటికి పంపించకుండా తరగతి గదిలోనే ఉంచినట్లు తెలుస్తోంది. ఈ విషయమై పిల్లాడి పేరెంట్ ఓ వీడియో సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయగా అది కాస్త వైరల్ అవుతోంది.
వివరాల్లోకివెళితే.. మేడ్చల్ జిల్లాలోని ‘ద క్రీక్ ప్లానెట్ స్కూల్’లో రూ. 30వేల ఫీజు బకాయి ఉందని 4వ తరగతి చదువుతున్న సూర్యన్ష్ సింగ్‌కు ఇంటికి పంపలేదు.మధ్యాహ్నం 3:30 గంటలకు పాఠశాల పూర్తయినా సాయంత్రం 6 గంటల వరకు పాఠశాలలోనే విద్యార్థిని యాజమాన్యం అక్కడే ఉంచుకుంది. దీంతో పిల్లాడి తండ్రి యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా,దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మేడ్చల్ జిల్లా.. 30 వేల ఫీజు బకాయి ఉందని పాఠశాలలో చదివే పిల్లాడిని తిరిగి ఇంటికి పంపని వైనం..
4వ తరగతి చదువుతున్న సూర్యన్ష్ సింగ్ తండ్రి పాఠశాల యాజమాన్యంపై ఆగ్రహం..
మధ్యాహ్నం 3:30 గం.లకు పాఠశాల పూర్తయినా సాయంత్రం 6గంటల వరకు పాఠశాలలోనే విద్యార్థిని ఉంచుకున్న వైనం. pic.twitter.com/ALqynvTfYe— ChotaNews App (@ChotaNewsApp) January 29, 2025