హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో గల 400 ఎకరాల భూమిపై ప్రస్తుతం వివాదం నెలకొన్న నేపథ్యంలో సీఎం రేవంత్ కేబినెట్ మంత్రులతో అత్యవసరంగా సమీక్ష నిర్వహించారు. మంగళవారం కమాండ్ కంట్రోల్ సెంటర్ వేదికగా హెచ్‌సీయూ భూముల వ్యవహారంపై చర్చించారు.విద్యార్థుల ఆందోళనలకు రాజకీయ పార్టీల మద్దతు పలకడంపై ఎలా ముందుకు వెళ్లాలనే విషయంపై మంత్రులతో డిస్కస్ చేసినట్టు సమాచారం.
400 ఎకరాల భూములపై సర్వహక్కులు ప్రభుత్వానివేనంటూ.. 2024 మేలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం ప్రస్తావించింది. ఇక 2003లో నాటి టీడీపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేసింది. వర్సిటీ, ప్రభుత్వం మధ్య పరస్పర అవసరాల కోసం భూమార్పిడి అగ్రిమెంట్ చేసుకోగా అందులో వర్సిటీ అధికారులు చేసిన సంతకాలతో కూడిన పత్రాలను ప్రభుత్వం విడుదల చేసింది.టీజీఐఐసీకి అప్పగించిన భూముల విషయంలో హెచ్‌సీయూ రిజిస్ట్రార్ ప్రభుత్వానికి విరుద్ధమైన ప్రకటన చేయడం వెనుక మతలబు ఏంటనే అంశంపై సీఎం రేవంత్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.