ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ నుంచి బయలుదేరిన సీఎం జగన్.. ఢిల్లీలో కేంద్ర మంత్రులతో వరుస భేటీల్లో పాల్గొంటున్నారు. ఢిల్లీకి వెళ్ళిన సిఎం జగన్ మొదటగా కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తో భేటీ అయ్యారు. ఆ తర్వాత కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కలిసిన ముఖ్యమంత్రి జగన్ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై చర్చించినట్టు సమాచారం అందుతోంది.
ఈ భేటీ తర్వాత రాత్రి 9 గంటలకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ కానున్నారు. పోలవరం నిధులు, విభజన హామీలు, వ్యాక్సినేషన్, ఇతర పెండింగ్ అంశాలపై అమిత్ షాతో సీఎం చర్చించే అవకాశం ఉంది. రేపు ఉదయం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో సీఎం జగన్ సమావేశం కానున్నారు. తిరిగి శుక్రవారం మధ్యాహ్నం తాడేపల్లికి చేరుకోనున్నారు సీఎం జగన్.